Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపచ్చదనం పెంపులో అటవీశాఖ అధికారుల పనితీరు భేష్‌

పచ్చదనం పెంపులో అటవీశాఖ అధికారుల పనితీరు భేష్‌

- Advertisement -

అటవీశాఖ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ప్రారంభంలో షూటర్‌ ఈషాసింగ్‌
నవంబర్‌లో అటవీశాఖ జాతీయ క్రీడలు : వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ ఈలు సింగ్‌ మేరు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పచ్చదనం పెంపులో అటవీశాఖ అధికారుల పనితీరు భేష్‌ అని ప్రముఖ షూటర్‌ ఈషాసింగ్‌ కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌ సమీపంలోని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలను అటవీ శాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షిణాధికారి(వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌) ఈలు సింగ్‌ మేరుతో కలిసి ఈషా సింగ్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహౌత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. దానిద్వారా అడవుల పెరుగుద లతో పాటుగా పర్యావరణ పరిరక్షణ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈలుసింగ్‌ మేరు మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ, పర్యా వరణ పరిరక్షణ వంటి కఠిన బాధ్యతలను అటవీ సిబ్బంది నిర్వర్తిస్తున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటుగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కాపాడాలని కోరారు. చిన్న వయసు లోనే ఈషా సింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గౌరవం తెచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలోని ఏడు జోన్ల నుంచి 750 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు నవంబర్‌ రెండో వారంలో డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొంటారని ప్రకటించారు. కార్యక్రమంలో సీసీఎఫ్‌లు శర్వణన్‌, రామలింగం, ప్రియాంక వర్గీస్‌, ప్రభాకర్‌, భీమానాయక్‌, అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌జే. ఆశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -