Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడవికి నిప్పు మానవాళికి ముప్పు 

అడవికి నిప్పు మానవాళికి ముప్పు 

- Advertisement -

– అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం 
నవతెలంగాణ – కాటారం

 కాటారం మండలంలోని ఆదివారం పేట, గుమ్మలపళ్లి, ఒడిపిలవంచ గ్రామాల్లో ఆదివారం అడవి శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ అనంతరం ఎఫ్ ఆర్ ఓ స్వాతి మాట్లాడుతూ… అడవికి నిప్పు పెట్టడం వలన మానవాళికి ముప్పు ఏర్పడుతుందని అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని ప్రజలకు సూచించారు.అంతేకాకుండా జంతువులను వేటాడడం చేయకూడదని, రైతులు వ్యవసాయ భూమి వద్ద పొలాల చుట్టూ కరెంటు తీగలు పెట్టడం చట్ట విరుద్ధమని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివారం పేట సర్పంచ్ ఓడేటి రంజిత్, ఉపసర్పంచ్ దానం సమ్మయ్య , గుమ్మల్లపల్లి సర్పంచ్ భక్తు శరత్ కుమార్, ఉప సర్పంచ్ తాళ్ల శేఖర్, ఓడిపిలవంచ సర్పంచ్ నర్వేద్ది మాధవి, ఉపసర్పంచ్ ఇసునం మహేందర్, డివైఆర్ఓ సురేందర్ నాయక్,  రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -