Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెంచులు సాగు చేసుకుంటున్న భూములను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు..

చెంచులు సాగు చేసుకుంటున్న భూములను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు..

- Advertisement -

ఏండ్లు గడుస్తున్నప్పటికి పరిష్కారం చూపడం లేదని చెంచులు ఆవేదన  
నవతెలంగాణ – అచ్చంపేట :
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉమ్మడి అమ్రాబాద్ మండలం పరిధిలోని కండ్లకుంటలో  చెంచులు ఫారెస్ట్ అధికారుల మధ్య ఉన్న భూమి వివాదం దశాబ్దాలు కాలం గడిచినప్పటికీ పరిష్కారం కాలేదు. చెంచులు వ్యవసాయ చేసుకోవడం కోసం కండ్లకుంట భూమిలో ఆదివారం చెట్లు తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. ఏండ్లు గడుస్తున్నప్పటి గానీ  గత ప్రభుత్వాలు గానీ, న్యాయస్థానాలు గాని మాకు సరైన న్యాయం చేయలేదని, ఎన్ని ఏళ్ళు సాగుకు దూరంగా ఉండాలని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంచు సేవా సంఘం అధ్యక్షులు దాసరి నాగయ్య తో పాటు 50 మంది స్థానిక చెంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -