ఒడిదుడుకులు ఎదురైనా కొనసాగిస్తాం
ఓటమితో బాధపడం.. విజయంతో పొంగిపోం
బీహార్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించిన ఆర్జేడీ
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ).. ఓటమి అనంతరం తొలిసారిగా స్పందించింది. ఓటమి ఎదురైతే బాధపడటం, విజయం వస్తే అహంకారం వ్యవహరించడం ఉండదని వివరించింది. ఓటమి ఎదురైనా తాము మాత్రం ప్రజాసేవను మరువమని పేర్కొన్నది. ఈ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రజాసేవను కొనసాగిస్తామని వివరించింది. ఆర్జేడీ పేదల పార్టీ అనీ, అది వారి మధ్య ఉంటూనే వారి గొంతుకను వినిపిస్తామని పేర్కొన్నది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన ఆర్జేడీ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష కూటమి మహాగట్‌బంధన్.. ఇటీవల ఫలితాల్లో 35 స్థానాలకే పరిమితమైన విషయం విదితమే. కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీయాదవ్ నేతృత్వంలో పోటీ చేసిన మహాగట్‌బంధన్ అందులో 25 సీట్లు మాత్రమే గెలుచుకున్నది.
ప్రజాసేవను మరువం
- Advertisement -
- Advertisement -



