Monday, June 16, 2025
E-PAPER

రూపం

- Advertisement -

పక్కింట్లో కోడిపిల్ల ఉండేది
వాళ్లు దాన్ని అత్తారుబత్తెంగా
పెంచి పెద్ద చేసారు.
అది పిల్లలతో కలిసి ఆడేది
అప్పుడప్పుడు నాతో కూడా.
ఓరోజు
పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి
వెళ్ళి చూస్తేఇంటావిడ
దాన్ని కోసి ఈకలు దూస్తుంది
పిల్లలంతా ఏడుస్తుంటే
పనిచేసుకుంటూ నవ్వుతుంది
ఎంతో అందంగా ఉండే
ఆవిడ ముఖం అప్పట్నుంచీ
క్రూరంగా కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడామె లేదు.
అయినా కూడా..!
– ర్యాలి ప్రసాద్‌ , 9494553425

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -