Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ ఏర్పాటు

అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం సూచన,ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాలతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అమ్మ ఆదర్శ కళాశాల అభివృద్ధి కమిటీని గురువారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, కన్వీనర్ గా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయాదేవి,కమిటీ మెంబర్,చైర్ పర్సన్ గా స్వయం సహాయక సంఘ సభ్యురాలు చిగురు మీనా తోపాటు ఇతర సభ్యులుగా కళాశాల అధ్యాపకులు నరేందర్,రవీందర్, వెంకట్ రెడ్డి,విద్యార్థుల పేరెంట్స్ నుండి రాగం రమేష్,రామిడి శ్రీనివాస్,దేవరకొండ వెంకటేష్, చీగురు సది, తోకల సుధాకర్, జగన్నాధుల సురేష్ లను నియమించడం జరిగిందన్నారు.ఈ కమిటీ కళాశాలను అభివృద్ధి చేయడానికి కావలసిన నిర్ణయాలు కమిటీలో సభ్యులు చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని కమిటీ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -