Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీజీటీజేఏసీ ఆవిర్భావం

టీజీటీజేఏసీ ఆవిర్భావం

- Advertisement -

చైర్మెన్‌గా చంద్రశేఖర్‌రావు, సెక్రెటరీ జనరల్‌గా నరసింహులు
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 30 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో తెలంగాణ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీటీజేఏసీ) ఆవిర్భ వించింది. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీజీటీజేఏసీ గౌరవాధ్యక్షులుగా హర్షవర్ధన్‌రెడ్డి, చైర్మెన్‌గా ఎన్‌ చంద్రశేఖర్‌రావు, సెక్రెటరీ జనరల్‌గా శానమోని నరసింహులు, కోశాధికారిగా మురళీధర్‌గౌడ్‌, కోచైర్మెన్లుగా మహమ్మద్‌ అబ్దుల్లా, ఎం వెంకన్న, సాబేర్‌, భూతం యాకమల్లు, చక్రవర్తుల శ్రీనివాస్‌, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్‌గా కిశోర్‌కుమార్‌, లక్ష్మణ్‌, దేవేందర్‌, నజీరుద్దీన్‌, కృష్ణ, జాన్‌ విల్సన్‌, సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా భార్గవి, గాదె లింగస్వామి, శ్రీనివాస్‌ మాలోత్‌, కృష్ణప్రియ, సాంబలక్ష్మి, పవన్‌ కుమార్‌ రెడ్డి, నజీముద్దీన్‌, దామోదర్‌, ప్రచార కార్యదర్శిగా అమీర్‌ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి, ఉపాధ్యాయులకు ప్రతినెలా పదోన్నతులను ఇవ్వాలని తీర్మానం చేశారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని తెలిపారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -