Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంఏపీ మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత

ఏపీ మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత

- Advertisement -

విజయవాడ : మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (93) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య విజయవాడలో ప్రముఖ హోటల్‌ ఐలాపురం స్థాపకుడిగా పేరుపొందారు. కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ప్రజాసేవలో ఎనిమిదేళ్లు విశేష పాత్ర పోషించారు. సాలివాహన (కుమ్మర) సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు సేవలందించారు. సామాజిక సేవల్లోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యాసంస్థలకు ఫర్నిచర్‌ విరాళాలు, విద్యార్థుల ప్రోత్సాహానికి సహాయం, తాగునీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, అన్నదాన సత్రాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు అందించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం విజయవాడలో నిర్వహిం చనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -