Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేళసంఘం సర్పంచులుగా నాడు అత్త.. నేడు కోడలు

మేళసంఘం సర్పంచులుగా నాడు అత్త.. నేడు కోడలు

- Advertisement -

ఒకే కుటుంబానికి పట్టం కడుతున్న మేళాసంఘం గ్రామ ప్రజలు..
నవతెలంగాణ – మునిపల్లి

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మునిపల్లి మండలం లోని మేళసంఘం గ్రామంలో గత పది సంవత్సరాలుగా ప్రజలు ఒకే కుటుంబానికి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సైతం అదే కుటుంబానికి మరో ఐదేళ్లు సేవ చేసే అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళితే నిన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కుప్పనగారం లక్ష్మి మేళాసంఘం గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు.

అయితే లక్ష్మీ భర్త సంగమేశ్వర్ గత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడుగా ఎన్నికై ఐదేళ్లపాటు ఉప సర్పంచ్ గా పని చేశారు. అంతకు ముందు జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్త సద్గుణమ్మ ఐదేళ్ల పాటు సర్పంచ్ గా పనిచేశారు. గత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఉప సర్పంచిగా తన భర్త సంగమేశ్వర్, మరో ఐదేళ్లు తన అత్త సద్గుణమ్మ సర్పంచ్ గా ప్రజాసేవ చేసి ప్రజల ఆదరా భిమానాలను పొందినందు వల్లనే మరో ఐదేళ్లు తనకు సేవ చేసే భాగ్యం కలిగిందని నూతన సర్పంచ్ లక్ష్మీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారం, గ్రామ ప్రజల అండదండలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని లక్ష్మీ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -