Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముమ్ముర ప్రచారం

గ్రామాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముమ్ముర ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ మండలంలోని డోన్ గావ్ సోపూర్ , సావర్గావ్ , గుండూర్ , లొంగన్ , గ్రామలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. బీఅర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు గ్రామ ప్రజలు మద్దతుగా వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 420 అమలు కాని హామీలు తప్ప, అభివృద్ధి చేయడంలో శూన్యం అని విమర్శించారు. అదేవిదంగా రాబోయే రోజులో వచ్చేది మన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు.

కేసీఆర్ అంటేనే సుభిక్షమైన పాలన.. కేసీఆర్ పాలన అంటేనే రైతన్న పాలన.. వారి హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుందని కొనియాడారు. బీఅర్ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు గుండూర్ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను నిరంతరం కృషి చేసి వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తదనంతరం ఆయన ఆధ్వర్యంలో సావర్గావ్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -