- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉత్తర తెలంగాణలోనే ఆదివాసీ వనదేవతల శ్రీసమ్మక్క-సారలమ్మ మహాజతర ఈ నెల 28 నుంచి 31వరకు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తాడిచెర్ల పిఏసిఎస్ తాజా మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య కు విఐపి దర్శనం దక్కింది. శుక్రవారం జాతరలో జనసందోహం ఉండడంతో మొండయ్య దంపతులను జంపన్న వాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు ప్రత్యేక సెక్యూరిటీతో వచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలపై అమ్మవార్ల అనుగ్రహం ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వెడుకొన్నట్లుగా ఇప్ప దంపతులు తెలిపారు.
- Advertisement -



