రాళ్ల దాడి కేసులో ఏ-1గా నమోదు
14 రోజుల రిమాండ్
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన రాళ్ల దాడి కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు మూల రాజిరెడ్డికి బుధవారం మంచిర్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏ1 బాల్క సుమన్‌తోపాటు దాడి కేసులో ఏ2గా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డికి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇరువురిని మంచిర్యాల కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. విచారణ అనంతరం ఇరువురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుమన్‌తోపాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు పోలీసులు.
క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ కాన్వాయ్ పై బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బాల్క సుమన్ రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులకు గాయపడటంతోపాటు మంత్రి వాహనం ధ్వంసమైనట్టు పోలీసులు పేర్కొన్నారు. బాల్క సుమన్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు క్యాతనపల్లిలోని సుమన్ ఇంటికి చేరుకున్నారు. సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. సుమన్ అరెస్ట్‌ను నిరసిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
సుమన్ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్, హరీష్‌రావు
క్యాతనపల్లిలో జరిగిన దాడి కేసులో పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అంటూ దుయ్యబట్టారు.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



