నవతెలంగాణ – నిజాంసాగర్ : గత పది ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిజాంసాగర్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి దుర్గారెడ్డి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానేత కేసీఆర్ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ను స్థాపించి బంగారు తెలంగాణ దిశగా అడుగు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మనోహర్, అచ్చంపేట్ సొసైటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్, అనిల్ దొర, పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



