నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ఎస్ ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ సీనియర్ నాయకులు జంపయ్య హాజరై కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని గుళ్లో ప్రత్యేక పూజలు మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో అరటి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జడ్పిటిసి మాజీ తుమ్మల హరిబాబు, వెలిశాల స్వరూపం మాజీ ఎంపీటీసీ, రైతుబంధు మాజీ కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు అంబటి వినయ్, పోరిక కిరణ్ కుమార్, పృథ్వీరాజ్ ఉట్ల సోషల్ మీడియా మండల కన్వీనర్ , అజ్మీర సురేష్, ఏ హనుమంతరావు, టి శ్రీనివాస్ రావు , చల్వాయి ఉప సర్పంచ్ బూరెటి మధు, ఆజ్మీర చందులాల్, మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య,మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్, పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస చారి, నాం పూర్ణచందర్ చల్వే గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్యదేవ బి దేవ, ఏ వినయ్, రాణి, ఏం రమేష్, పసుల భద్రయ్య, చెంచు యాకోబ్, ఇంద్రారెడ్డి, కేదారి,కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పల్లపు కుమార్, దర్శనాల సంజీవ, అంబాల నరేందర్, రాంబాబు, బోధ కనకయ్య, వెంకన్న, డి పున్నం, తదితరులు పాల్గొన్నారు.



