నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ వార్డ్ నెంబర్ 15 మాజీ కౌన్సిలర్ శ్రీరామ్మోహన్ ను ఆదివారం సమాచారాహక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఎ. సలీం, జిల్లా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. గత నాలుగు రోజుల క్రితం నుండి అధిక వర్షపాతంతో నష్టపోయిన అశోక్ నగర్ వాసులను రామ్మోహన్ తన సొంత ఖర్చులతో వారికి ఆర్థికంగానూ సాయం చేస్తూ, అలాగే భోజనము బట్టలు ప్రజలకు అందించి వారికి అండగా ఉన్నారు, ఆయన చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు అశోక్ నగర్ కాలనీ వార్డ్ నెంబర్ 15 కామారెడ్డి రామ్మోహన్ స్వగృహానికి వెళ్లి శాలువా మేమంటూ తో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాచారకు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, కామారెడ్డి పట్టణ మహిళ కార్యదర్శి అస్మ బేగం, అశోక్ నగర్ వాసులు పాల్గొన్నారు. దీనిపై స్పందించిన రామ్మోహన్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వారు కూడా సాంఘిక కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఆదుకోవడం తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో సహ చట్టం సభ్యుల పై గర్వపడుతున్నాను అన్నారు. సహచట ప్రతినిధులను అభినందించారు.
మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ కు ఘనంగా సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES