- Advertisement -
నవతెలంగాణ-దేవరకొండ
సీఐడీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌ను శనివారం దేవరకొండ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐడీ విచారణ పేరుతో వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అభివృద్ధిని మరిచి.. ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -



