Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంఘనంగా మాజీ హెచ్ ఎం ఫణి కుమార్ రెడ్డి జయంతి

ఘనంగా మాజీ హెచ్ ఎం ఫణి కుమార్ రెడ్డి జయంతి

- Advertisement -

– తండ్రి పనిచేసిన పాఠశాలలో తనయులు చే విద్యార్ధులకు తిధి భోజనం ఏర్పాటు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని కొత్తమామిళ్ళవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ ప్రధానోపాద్యాయులు, సత్తుపల్లి వాసి దివంగత దాసరి ఫణి కుమార్ రెడ్డి ప్రధమ జయంతి ని గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారులు నికిత్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి లు తన తండ్రి పనిచేసిన మామిళ్ల వారి గూడెం పాఠశాల విద్యార్థులకు తిధి భోజనం ఏర్పాటు చేశారు. (తిధి భోజనం అంటే గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు,జయంతి,వర్ధంతి తిధులు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి చేసుకునే ఏర్పాటుని తిధి భోజనం అంటారు. ఈ విధానాన్ని కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చింది) ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పొన్నగంటి ప్రసాదరావు ఫణి కుమార్ రెడ్డి పాఠశాలకు చేసిన సేవలను వృత్తిపట్ల వారి అంకిత భావాన్ని కొనియాడారు.ఫణి కుమార్ రెడ్డి ఆశయ సాధనకు ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కటి భోధన  చేయాలని ఆయన సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు ఫణి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు చాక్లెట్ స్వీట్లు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -