గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూత
సంతాపం తెలిపిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గం..
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (83) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం నిద్రలో నుండి లేచిన ఆయన మొఖం కడుక్కున్న పిదప నలతగా ఉందని మళ్లీ పడుకుని గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. గత జూలై నెలలో ఆయన భార్య ముత్యాలమ్మ మరణించారు. కొండుగారి రాములు 1989 నుండి 1999 వరకు సీపీఐ(ఎం) నుండి దశాబ్దకాలం పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆ సందర్భంగా అనేక భూ పోరాటాలు ప్రజా ఉద్యమాల్లో చురకైన పాత గురించి విజయం సాధించారు. 1989 సీపీఐ(ఎం) జిల్లా రథసారథులు పాషా నరహరి హత్య అనంతరం ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) విస్తరణకు చురుకైన పాత్ర పోషించారు.
1989 అక్టోబర్ 26 నా పాషా నరహరి అత్యధిక గావించబడితే.. అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండిగారి రాములును బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించారు. ఇబ్రహీంపట్నంలో ఎర్రజెండా ఎగిరింది. రెండవసారి 1994లో జరిగిన ఎన్నికల్లోను రెండోసారి విజయం సాధించారు. మూడోసారి 1999లో జరిగిన ఎన్నికల్లో 22వేలకు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. శాసనసభ్యునిగా అనేక విజయాలు సాధించి ప్రజలకు సేవలు అందించారు. నిజాయితీకి నిలువుటద్దంగా నిరారంబర జీవితాన్ని గడిపారు. తను శాసనసభ్యునిగా ఎన్నికైన నాటి నుండి ఆగస్టు 15 జనవరి 26 సందర్భంగా జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయానికి ఆయా సందర్భాల్లో క్రమం తప్పకుండా తన అనుచరులతో వచ్చి జెండాకు సెల్యూట్ చేసేవారు ఆయన నిడారంభ్రతను అధికారులు ప్రజలు కొనియాడేవారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చిన్న కుమారుడు కొండిగారి త్రిలోక్ కుమార్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ గా బీఆర్ఎస్ నుండి విజయం సాదించారు.
మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన ఆయనకు కుమారులు కిరణ్ , త్రిలోక్ కుటుంబాలతో కలిసి ఆయన ఇబ్రహీంపట్నం బృందావన్ కాలనీలో నివసిస్తున్నారు. ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు అరుణ్ కుమార్ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మృతిచెందారు. నిజాయితీకి నిలువుటద్దంలా ప్రజలకు నిస్వార్థ సేవలందించిన కొండిగారి రాములు ఆకస్మిక మృతి పట్ల సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గం, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అణగారినవర్గాల అభ్యున్నతికి తపించిన అభ్యుదయవాదిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పారు.



