Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 80వ జన్మదిన రోజు వేడుకలు 

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 80వ జన్మదిన రోజు వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ  – మిరుదొడ్డి
ప్రజా సేవకుడు రైతు బాంధవుడు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యారెడ్డి 80 జన్మదినాన్ని కాంగ్రెస్ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం అల్వాల చెప్పాలా X రోడ్డు వద్ద స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల రాజేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, సిద్ది భారతి భూపతి గౌడ్ లు మాట్లాడుతూ రైతు బాంధవుడు మాజీ మంత్రివర్యులు ముత్యంరెడ్డి సేవలు రైతం గానికి మరువలేని అని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం తెలిపారు. కుడవల్లి వాగు నుండి నీరు ప్రవహిస్తుందంటే నేడు ముత్యరెడ్డి నిర్మించిన చెక్ డ్యాములవలనే రైతులు పంటలు వేసుకుంటున్నారని తెలిపారు. నియోజవర్గంలో ఇలాంటి రైతు నాయకుడు లేరని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమా గౌడ్, అల్వాల గ్రామ అధ్యక్షుడు నీరుటి రాజు, చెప్యల గ్రామ అధ్యక్షులు బాసన్నగారి కన్నా రెడ్డి, మట్టే సత్య నారాయణ  రెడ్డి,యాదగిరి, మహేశ్, SC సెల్ అధ్యక్షులు జగ్గ స్వామి,ఎల్లేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -