అధికార లాంఛనాలతో కార్యక్రమం
నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-తుంగతుర్తి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం అధికార లాంఛనాలతో జరిగాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలిరాగా.. భారీ జనసంద్రం మధ్య అంతిమయాత్ర సాగింది. తుంగ తుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చేశారు. మండల కేంద్రంలోని దామోదర్‌రెడ్డి నివాసంలో ఆయన భౌతికకాయాన్ని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల మంత్రి అడ్డూరి లక్ష్మణ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించారు. కాగా, రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) ఈనెల ఒకటో తేదీ రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.
ఆయన మృతదేహానికి ఎమ్మెల్యేలు మందుల సామేలు, జగదీశ్‌రెడ్డి, బాలునాయక్, బత్తుల లక్ష్మా రెడ్డి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, యశస్విని రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, కోటిరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, వేనేపల్లి చందర్రావు, బూడిద బిక్షమయ్య గౌడ్, సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్‌రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అనురాధ, బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు సరిత, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డి, జ్ఞాన్‌సుందర్, యుగంధర్, పాల్వాయి రజిని, బైరు వెంకన్న, ఇటికాల చిరంజీవి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, గుడిపాటి నర్సయ్య తదితరులు నివాళులర్పించారు. దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ప్రజలకు సేవలందించారు. నాలుగు దశాబ్దాలపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.
ముగిసిన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES