Monday, September 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మాజీ మంత్రి పి.నర్సారెడ్డి 95వ జయంతి వేడుకలు..

మాజీ మంత్రి పి.నర్సారెడ్డి 95వ జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ-సారంగాపూర్
మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి నర్సారెడ్డి 95వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడారు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేసి భూ చట్టం అమలు చేసి తన స్వంత భూమిని పేదలకు పంపిన మహనీయుడు స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మాత అని ఆయన సేవలను కొనియాడారు.

రాష్ట్రప్రభుత్వం స్వర్ణ ప్రాజెక్టు క్రీ .శే”పి.నర్సారెడ్డి పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణ రెడ్డి, అడెల్లి పోచమ్మ దేవస్థాన చైర్మన్ సింగం భోజ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ రాజ్ మహమ్మద్, మాజీ అడెల్లి చైర్మన్ ఉట్ల రాజేశ్వర్, స్వర్ణ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఓలత్రి నారాయణ రెడ్డి,నాయకులు లక్ష్మారెడ్డి, కె.నారాయణ రెడ్డి, నర్సారెడ్డి, జగదీష్, జ్ఞానేశ్వర్, సలీమ్, దాసరి లక్ష్మణ్,చిన్నయ్య,పోతన్న దాసరి రమేష్, లక్ష్మణ్ రావు పటేల్, నారాయణ రెడ్డి, సురేందర్, రమణ, కేకే రావు, మార్కెట్ డైరెక్టర్లు ,నర్సారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -