నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలో గురువారం స్వర్గీయ మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు పి.నర్సారెడ్డి రెండవ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు హాజరై మాట్లాడారు. పి నర్సారెడ్డి (నర్సన్న బాపు) ఎమ్మెల్యే, ఎంపీ,ఎమ్మెల్సీ , రాష్ట్ర మంత్రిగా పిసిసి అధ్యక్షులు గా పనిచేసి నిర్మల్ జిల్లా తోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ఎనలేని సేవచేసి ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఐర నాయనారెడ్డి,నిర్మల్,సారంగాపూర్ మార్కెట్ చైర్మన్ లు అబ్ధుల్ హాది,సోమ భీమారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ లు రాజేశ్వర్,రాజ్ మహమ్మద్,శ్రీనివాస్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు,ఎంపిటిసి లు పి నర్సారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.



