ఉమ్మడి ఏపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు
నవతెలంగాణ-సూర్యాపేట
అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీమంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి దామోదర్ రెడ్డి బుధవారం రాత్రి 10.10 గంటలకు కన్నుమూశారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలోని పాతలింగాల గ్రామంలో 1952 సెప్టెంబర్ 14న రాంరెడ్డి జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి 1985 లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఆయన నల్లగొండ ఇల్లా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు.
తుంగతుర్తి, సూర్యాపేట నుంచి ఆరుసారు ఎమ్మెల్యేగా గెలిచారు. సూర్యాపేట నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన దామోదర్‌రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలవనరులు, ఎక్సైజ్ శాఖా మంత్రిగా పని చేసిన దామోదర్‌రెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలోనూ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి దేవాదాయ శాఖా మంత్రిగా కూడా వెంకట్‌రెడ్డి పనిచేస్తూ అనారోగ్యంతో మరణించారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం తుంగతుర్తిలో జరగనున్నాయి.
మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES