- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త అయిల్ వార్ గంగారాం కుమార్తె వివాహ మహోత్సవం లక్ష్మి కల్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ప్రేమ, సౌభాగ్యం, ఆనందాలతో నిండాలని ఆశీర్వదించారు. వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో జుక్కల్ బీఆర్ఎస్ నాయకులు వాసరె రమేష్ పటేల్, శివాజీ పటేల్, కిరణ్ బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



