నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు హనుమాన్ జయంతి సందర్బంగా అబయాంజనేయ స్వామి ని దర్శించికొని పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు.విషయం తేలుసుకున్న సర్పంచ్ తూర్పు మౌనిక నిఖిల్, ఉప సర్పంచ్ గంగాధర్, సంతోష్ రెడ్డి తోపాటు తదితరులు మార్యద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగా దాస్, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, మాల్లపూర్ సర్పంచ్ మోహన్, మాజీ ఎంపిటిసి చింతల దాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, డీ కొండ సుదీర్, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.



