Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సహకారంతోనే గ్రామాల్లో అభివృద్ది ప్రత్యేక అధికారి : శ్రీనివాస్ 

ప్రజల సహకారంతోనే గ్రామాల్లో అభివృద్ది ప్రత్యేక అధికారి : శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ -ధర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళికా రూపొందించి, నేడు  గ్రామస్థాయిలో చేపట్టిన గ్రామస్యభలకు మంచి స్పందన వచ్చింది. ఇందులో బాగంగా మండలంలోని అననిగ్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అన్నివర్గాలతో గ్రామాసభల కార్యక్రమని అధికారులు పూర్తి చేశారు. ఇందులో బాగంగా మందళాకేంద్రములోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామస్యభలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమములో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ప్రజలకు అందేవిధంగా నిర్వహించేందుకే ఈ గ్రామస్యభల ముఖియాఉద్దేశమని అన్నారు.

99 రోజుల ప్రణాళికలో ప్రజలకు కావాసిన అభివృద్దిని ప్రణాళికలు చేసి ఒకదాని తరవాత ఒక అభివృద్ది కార్యక్రమము పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పనులకు ప్రణాళికా బద్దంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లు ,రైతు భీమా,రైతు భరుస ,ఉచిత విధ్యుత్,తదితర అన్నీ పథకాలు ప్రజలకు అందేవిధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు సమన్వయంతో అధికారుల సహకారంతో గ్రామాన్ని అన్నీ విధాలా అభివృద్ది చేసుకుండామని అన్నారు. కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్,ఉప సర్పంచ్ శ్రీకాంత్,మాజీ సొసైటీ చెర్మెన్ చెలిమెల మల్లికార్జున, వార్డు సభ్యులు శ్రావణ, చెలిమెల అజయ్, వినయ్ గౌడ్, మంచికంటి ప్రశాంత్, అబ్దుల్ మజీద్, రాజు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -