Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్కుషాయిగూడలో వివాహిత ఆత్మహత్య

కుషాయిగూడలో వివాహిత ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్/ కుషాయిగూడ
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీదర్ (కర్ణాటక)కు చెందిన రాజేందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేందర్ సింగ్ కుమార్తె సోనం ఠాకూర్ (26) ను మౌలాలి ఇందిరానగర్‌కు చెందిన యోగేష్ ఠాకూర్‌కు 2020లో వివాహం చేశారు. అనంతరం దంపతులు మౌలాలి హెచ్‌బీ కాలనీలో నివసిస్తూ ఉండగా, వారికి ఒక కుమార్తె ఉంది.

ఈ నెల 20వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సోనం ఫోన్‌కు స్పందించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన తండ్రి, పక్కింటి మహిళ భారతేశ్వరమ్మను సంప్రదించారు. ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా, సోనం బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను కిందకు దించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పరిశీలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే భర్త యోగేష్ మరియు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -