నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లమ్మ గల్లి నుండి అవల్గావ్ బీటి రోడ్డు గత 40 ఏండ్లుగా పూర్తిగా మూసుకుయింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎట్టకేలకు ఈ రోడ్డుకు మొక్షం లభించింది. ఆయన సహకారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల రావాణా సులభైంది. ఏండ్లుగా రహదారికి నోచుకోని దారికి ఓ రూపును తీసుకొచ్చారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఘనత గ్రామ సర్పంచ్ సంతోష్ మేస్త్రీకి దక్కుతుందని అన్నారు. మట్టి రోడే కాకుండా బీటీ రోడ్డు నిర్మించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
40 ఏండ్ల రోడ్డు సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



