మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం
నవతెలంగాణ – చండూరు
చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం విమర్శించారు. బుధవారం ఆయన గట్టుప్పల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. చేనేత సహకార సంఘాల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వ్యాఖ్యానించారు.
ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో చేనేత లకు ఒరిగిందేమిలేద న్నారు. గత ప్రభుత్వం టెస్కో ద్వారా 150 కోట్లు కేటాయించి చేనేత ద్వారా విద్యార్థులకు యూనిఫాం బట్టలకు టెండర్లు ఇచ్చింది, ఇపుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లను రద్దు చేస్తూ ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకించారు. టెస్కో ద్వారానే విద్యార్థులకు బట్టలు కొనుగోలు చేయాలని అన్నారు. చేనేత భరోసా పథకం కేవలం అవగాహన సదస్సులకే తప్ప అమలు లేదన్నారు.వడ్డీ మాఫీ, త్రిప్ట్ భరోసా, చేనేత పథకాలకు రూ.1000 కోట్లు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కళ్ళుతెరిచి సహకార సంఘాల నుంచి బట్టలు కొనుగోలు చేసి కార్మికుల కు పని కల్పించాలని కోరారు.వృత్తి లో కొనసాగుతున్న కార్మికుల కు జియో ట్యాగ్ వేయాలని ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వన్నీ కోరారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే, ముందు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పున్న కిషోర్, చిలుకూరి ఆంజయ్య, నారని జగన్,చేరుపల్లి కృష్ణ,నేలాంటి వెంకటేశం,చేరుపల్లి నగేష్, తదితరులు పాల్గొన్నారు.



