- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డోంగ్లి మండలంలోని మదన్ హిప్పర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ బాచా వార్ లక్ష్మణ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువులు నేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీనివాస్ ఆ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



