- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు : కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు గ్రామ ఉపసర్పంచ్ బాషబోయినపైడిని ఆదివారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ధర్మారెడ్డి , వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పరామర్శలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



