నవతెలంగాణ – పరకాల
పట్టణానికి చెందిన ప్రముఖ బి.ఆర్.ఎస్. నాయకులు ఏకు కార్తీక్ తండ్రి, ఏకు శంకర్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పరకాల మాజీ శాసనసభ్యులు, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు చల్లా ధర్మారెడ్డి శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
అనంతరం పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్. నాయకులు బరిగేల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం రాజయ్య నివాసానికి వెళ్లి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



