- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని తాడిచర్ల, గాదంపల్లి,కిషన్ రావునపల్లి గ్రామాల్లో ఇటీవల పలు కారణాలతో మృతిచెందిన పలు మృతుల కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదివారం పరామర్షించి ఓదార్చారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.తాడిచర్ల గ్రామంలో తాండ్ర జక్కమ్మ,ఎండి అలిమ్,ఆకుల ఓదెలు, కిషన్ రావు పల్లె గ్రామంలో పొలం రామయ్య,గాదంపల్లె గ్రామంలో గాధం భూధమ్మ తదితర బాధిత కుటుంబాలను పరమర్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,రావుల మొగిలి, నారా రమేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు
- Advertisement -