- Advertisement -
నవతెలంగాణ-జన్నారం
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్‌నాయక్(71) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా(1985) గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ నుంచి 1994లో ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరం మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరి 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకునిగా చురుకైన పాత్ర పోషించారు. గోవింద్ నాయక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
- Advertisement -



