Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా కేంద్రంలోని 8 వ వార్డుకు  చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భార్గవ్ తేజ యాక్సిడెంట్ లో మరణించగా, బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ లో భాగంగా 2 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారునికి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయడం, కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోగా సభ్యత్వ నమోదు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారుని తల్లి సరోజకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపులు అమరేందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్ కుమార్ , రచ్చ  శ్రీనివాసరెడ్డి, నాయకులు ఇట్టబోయిన గోపాల్, అజీముద్దీన్, రాచమల్ల సుదర్శన్ లు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -