నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త పండరి భార్య లక్ష్మి భాయి శుక్రవారం రోజున గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఆదివారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సావర్గావ్ గ్రామంలోని వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మనోధయాన్ని కలిపించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అన్ని విధాలుగా కార్యకర్తలను కాపాడుకుంటుందని ఎటువంటి సమస్యలున్న పార్టీ కట్టర్ బాధితులను పంచన పెట్టుకుని వారి బాగోగులే పార్టీకి ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ పవర్, అశోక్ పటేల్, అశోక్ పటేల్,పెద్ద కొడపగల్ మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చార్ రాజు, బసవరాజ్ పటేల్, మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి, కాశీరం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES