Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలి..

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలి..

- Advertisement -

– నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు..
నవతెలంగాణ – జుక్కల్

ఈ నెల 14న గురువారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షుడు నీలు పటేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన అభిమాన నాయకుడు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలను వచ్చే గురువారం ఉదయం 9 గంటలకు బిచ్కుంద మండలం గోపనపల్లి గ్రామం చౌరస్తా వద్ద ఉన్న అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు. అనంతరం అక్కడినుండి ర్యాలీగా బయలుదేరాలని అన్నారు. జుక్కల్ మండలానికి చెందిన  బీఆర్ఎస్ నాయకులు జుక్కల్ చౌరస్తా వద్ద ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. చౌరస్తా నుండి అంజనాద్రి వరకు భారీగా బైక్ , కార్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ర్యాలీలు, పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -