నవతెలంగాణ – జుక్కల్
ఇండియన్ ఆర్మీలో విధులను పూర్తిచేసుకుని తిరిగి తమ స్వగ్రామానికి వచ్చిన జుక్కల్ మండలం గ్రామానికి చెందిన అర్జున్ ఆర్మీ మెన్ ఎనలేని దేశ సేవలందించినందుకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ సందర్బంగా మండల సీనియర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి ఆయనను సన్మానించినారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జుక్కల్ మండలానికి చెందిన అర్జున్ ఇండియాన్ ఆర్మీలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి , దేశం రక్షణ కోసం గత 15 ఏళ్లుగా ఎనలేని సేవలు భారతదేశానికి అందించి, తన బాధ్యతలు పూర్తి చేసుకొని జుక్కల్ కు తిరిగి వచ్చారని అన్నారు. అర్జున్ కు జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు సీనియర్ బీ ఆర్ ఎస్ నాయకులు నీలు పటేల్ , మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, యువ నాయకుడు వాస్రే రమేష్ , విట్టు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీమెన్ అర్జున్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES