Friday, March 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ సీపీఎం నాయకుడు కొండిగారి రాములు (91) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తరపున 1989, 1994లో వరుసగా రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత నిజాయితీ గల ప్రజాప్రతినిధిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1935లో మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జన్మించిన రాములు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడబెట్టకుండా సామాన్య జీవితం గడిపిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు. నిబద్ధత, నిజాయితీ కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -