Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి : టీజేఎస్‌

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి : టీజేఎస్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫార్మాసిటీ, భూదాన్‌ భూముల్లో అక్రమాలకు పాల్పడిన ఇబ్రహీంపట్నం మాజీ మ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డినీ, అప్పటి ఆర్డీవో వెంకటాచారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినరు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధార సత్యం ఒక ప్రకటన విడుదల చేశారు. యాచారం మండలం, తాడిపర్తి గ్రామం సర్వే నెంబర్‌ 104లో గల 250 ఎకరాల భూదాన్‌ భూముల విషయంలో మంచిరెడ్డి ప్రోత్సాహంతో వెంకటాచారి దొంగ పాస్‌ పుస్తకాలను మంజూరు చేసి వారికి అనుకూలంగా ఉన్న వారికి నష్టపరిహారం ఇప్పించారని వారు ఆరోపించారు. గ్రామానికి చెందిన దళితులకు నష్టపరిహారం చెందాలని పోరాడిన ధార సత్యంపై అక్రమంగా కేసులు బనాయించగా, వీటిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే అక్రమార్కులను అరెస్టు చేసి వారి నుంచి నష్ట పరిహారం డబ్బును రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad