Sunday, March 1, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో విస్తృతండా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా 

అశ్వారావుపేటలో విస్తృతండా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
మాజీ ఎమ్మెల్యే, బీ ఆర్ఎస్ అశ్వారావుపేట ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం అశ్వారావుపేట మండలం లో విస్తృతంగా పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన గంగారం యువకుడు అల్లూరి నవీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనను పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన బీ ఆర్ఎస్ కార్యకర్త నార్లపాటి ప్రదీప్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఆయనకు మనోధైర్యం కల్పించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఓదార్చారు. బీఆర్ఎస్ నాయకుడు సోమాని రమేష్ మేనల్లుడు హేమంత్ వివాహం ఇటీవలే జరగగా,వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కోటగిరి కిషోర్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని,నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు కొల్లు రవి కిరణ్, డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి,వేదాంతపురం ఉపసర్పంచ్ వీర్రాజు,జెడ్పీటీసీ మాజీ సభ్యులు జూపల్లి కోదండ వెంకట రమణారావు,పద్మజ,మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,ఉపాధ్యక్షులు మందపాటి రాజ్ మోహన్ రెడ్డి,

మల్లాయిగూడెం,వేదాంతపురం మాజీ సర్పంచ్ లు నారం రాజశేఖర్,సోని శివ శంకర్ ప్రసాద్,పార్టీ మండల అధ్యక్షులు జజ్జూరి వెంకన్నబాబు,పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ,కోటగిరి సీతారామస్వామి, యూఎస్ ప్రకాశ్ రావు, కాసాని చంద్ర మోహన్,సంక ప్రసాద్,వగ్గెల పూజ,

జుజ్జూరపు శ్రీరామమూర్తి,తగరం జగన్నాధం,కాసాని నాగ శేష పద్మ,ఏలేటీ పార్వతి,గుడవర్తి వెంకటేశ్వరరావు,చందా లక్ష్మీ నర్సయ్య, చిక్కం గోపి,గోవింద్ లు పాల్గొన్నారు. ఈ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -