- – నిజమైన అభివృద్ది చేసేది నేటి ఎమ్మెల్యే జారె నే..
– పూర్వ టీఆర్ఎస్ వారికే కొత్తగా కండువాలు వేసారు….
– టీఆర్ఎస్ లో కాంగ్రెస్ వారు ఎవరూ చేరలేదు…
– విలేకర్లు సమావేశంలో నాయకులు తుమ్మ రాంబాబు - నవతెలంగాణ – అశ్వారావుపేట
- తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అశ్వారావుపేట నియోజక వర్గం లో పనులు అన్నీ ప్రతిపాదనలు కే నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరిమితం అయ్యారని, నిజమైన పనులు, అభివృద్ధి 18 నెలలుగా ఉన్న పరిపాలిస్తున్న నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని కాంగ్రెస్ మండల నాయకులు తుమ్మ రాంబాబు అన్నారు.
- కాంగ్రెస్ చేసింది ఏమీలేదు,ఆ పార్టీలో నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు అంటూ ఆదివారం మాజీ మెచ్చా నాగేశ్వరరావు ప్రకటించడంతో ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ నాయక శ్రేణి సోమవారం ఆఘమేఘాలు పై స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో విలేకర్లు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా తుమ్మ రాంబాబు మాట్లాడుతూ 10 ఏండ్ల కాలంలో చేయని పనులను 18 నెలల కాలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేసి చూపిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం,సగం ధరకే వంటగ్యాస్ సరఫరా,మహిళా సాధికారత పెంపుతో కోటీశ్వరులు ను చేయడం,నియోజక వర్గం వ్యాప్తంగా ప్రతీ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్,డ్రైనేజీ,రోడ్డు విస్తరణ పనులు,ప్రతీ పంచాయితీలో రూ.1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. అశ్వారావుపేట గత అభివృద్ది అంతా ఉమ్మడి నియోజక వర్గంలో నాడు మంత్రులుగా జలగం వెంగళరావు,తుమ్మల నాగేశ్వరరావు,అనంతరం జలగం వెంకట్రావు,ప్రత్యేక నియోజక వర్గం అయ్యాక నాటి మొదటి ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన హయాంలో నే అభివృద్ది జరిగిందని,మెచ్చా నాగేశ్వరరావు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నంసెట్టి సత్యనారాయణ,వేముల భారతి,ప్రతాప్,గేదెల సురేష్ తదితరులు పాల్గొన్నారు.