నవతెలంగాణ – ముధోల్
నిర్మల్ జిల్లా కి జల్ శక్తి జల్ భాగ్యదారి అవార్డు వచ్చినoదుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, డిఆర్డివో విజయలక్ష్మి లకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అవార్డు రావడం అబింనదనీయమని ఆయన పేర్కొన్నారు. ఆనంతరం కలెక్టర్ కు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే విన్నవించారు.
రైతులు సొయా కొనుగోలు కేంద్రంలో అమ్మిన తరువాత లారీ లలో గోదాములకు పంపుతారు. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ నాపిడ్ వారు ఒక లారీ లో ఉన్న సంచులలో రెండు వందల నుండి 300 వరకు సంచులు తిరిగి కేంద్ర లకు వాపసు పంపుతుండటం వల్ల, రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నిన్నటి నుండి నాపిడ్ సర్వయర్ లు ప్రతి సెంటర్ కు వచ్చి , కొనుగోలు కేంద్రంలోనే రిజెక్ట్ చేస్తున్నారని, దీనివలన రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నయని చెప్పారు. ఈ విషయంపై తొందరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మాజీ ఎమ్మెల్యే కోరారు.



