తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు: పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కనీసం కిషన్ రావుపల్లి రోడ్డుకు అటవీశాఖ నుంచి అనుమతులు తేని దద్దమ్మ మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఆరోపించారు. బుధవారం మండలంలోని కిషన్ రావు పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యపు వ్యాఖ్యలన్నారు. తమ నాయకుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కిషన్ రావుపల్లి రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేక జీవో 113 తీసుకొచ్చి,పారెస్ట్ అధికారులకు చెల్లచాల్సిన రూ.4.70 కోట్లు చెల్లించి, రోడ్డు నిర్మాణం కోసం రూ.33 కోట్ల,70 లక్షల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మధు ఎమ్మెల్యేగా నాలుగేళ్లు, జెడ్పి చైర్మన్, సహాయక మంత్రి స్థాయి పదవుల్లో ఇద్దరు ఐదేళ్లు ఉన్న కాలంలో కనీసం రోడ్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు తీసుకరాలేని మీరు దద్దమ్మలు కాదా.. అని ప్రశ్నించారు. రోడ్డు ఆలస్యం అవుతుందని చెప్పడం కాదు బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దరిద్రపు ధరణితో అటవీశాఖకు కేటాయించిన ఏస్ఎం కొత్తపల్లిలో సర్వే నెంబర్ 1196/1లో 4 హెక్టార్ల 23 గంటల భూమికి కలెక్టర్, రెవెన్యూశాఖ కేటాయించిన ఆన్ లైన్లో చూపకపోవడంతోనే ఇటీవల మ్యాన్యూవల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నవడ్లు పండించండి అని రైతుల నుంచి సన్నదాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టినట్లుగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతు దరతోపాటు బోనస్, 200 యునిట్ల ఉచిత విద్యుత్, రూ.2లక్షల రుణమాఫీ, పావల వడ్డీలకు స్వశక్తి గ్రూపు మహిళలకు రుణాలు, రేషన్ కార్డులున్న ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. తమ నాయకుడు శ్రీదర్ బాబు చదువుకున్న విద్యావంతుడు కాబట్టి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మేనిపేస్టో చైర్మన్ గా,మంత్రిగా నియోజకవర్గంతోపాటు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్, యువత డివిజన్ నాయకుడు మండల రాహుల్,యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫారెస్ట్ అనుమతులు తేని దద్దమ్మ మాజీ ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES