- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల లచ్చయ్య కూతురు ప్రత్యూష-సనయ్ వివాహం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



