Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువకుడి గల్లంతుపై మాజీ ఎమ్మెల్యే ఆరా..

యువకుడి గల్లంతుపై మాజీ ఎమ్మెల్యే ఆరా..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని గోదావరినదిలో యువకుడి గల్లంతుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరా తీశారు. మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయి గోదావరినదిలో స్నానం చేసేందుకు నదిలో దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్నమంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ యువకుడు గల్లంతైన గోదావరినది తీరాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. యువకుడు నదికి ఎందుకు వచ్చాడని తెలుసుకున్న ఆయన యువకుడి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, సిబ్బందితో  మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని రెస్క్యూ టీం సిబ్బందిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -