Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

జీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ-  జుక్కల్
స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే జుక్కల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానాయకుడు కేసీఆర్ పాలనలో గ్రామ గ్రామాన మౌలిక సదుపాయాలు, రోడ్లు, సాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాలు అమలయ్యాయని ప్రజలకు వివరించారు. అలాగే, రెండు సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఒక్క స్పష్టమైన కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. ప్రతి గ్రామంలో ప్రజలు కేసీఆర్ గారి అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ బి ఆర్ ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని హన్మంత్ షిండే గారు తెలిపారు. కావున గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం నిలవాలంటే, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన హృదయపూర్వకంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు నీలుపటేల్, బొల్లి గంగాధర్ , తాటి భూమయ్య , వాస్రే రమేష్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -