- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని దుర్గామాత మందిరం వద్ద పూజ హారతికి హాజరైన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ క్రమంలో దుర్గమాతకు పూజలు చేసి, హారతి ఇచ్చారు. అనంతరం మాతా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గదేవి ఆశీర్వాదములు మన అందరికి ఉండాలి అని అన్నారు. దుర్గమాత అష్ట అవతారాలు గురించి దసరా పండుగ, విజయదశమి విశిష్టతను తెలియజేశారు. ఈ ఉత్సవలో జుక్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -