Tuesday, January 20, 2026
E-PAPER
Homeక్రైమ్మాజీ ఎమ్మెల్యే షిండే ముఖ్య అనుచరుడు గుండెపోటుతో మృతి

మాజీ ఎమ్మెల్యే షిండే ముఖ్య అనుచరుడు గుండెపోటుతో మృతి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రానికి చెందిన కిరణ్ బీఆర్ఎస్ యువ నాయకుడిగా.. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అనుచరుడిగా ఉంటూ జుక్కల్ మండలంలో కిరణ్ సూపరిచుతుడు. యువ నాయకుడిగా పార్టీకి కష్టపడే నాయకుడిగా గుర్తింపు పొందారు. మంగళవారం ఆకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఈ విషయం నియోజకవర్గంలో వ్యాపించడంతో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే షిండే తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించుకొని మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలకు విచ్చేశారు. మండలంలోని యువ నాయకుడు దళిత నాయకుడిగా గుర్తింపు పొందిన కిరణ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం వలన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచ్లు సంతాపాన్ని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -