- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మంగళవారం పవిత్ర దినం సందర్భంగా జుక్కల్ చౌరస్తా హనుమాన్ మందిర్‌లో ఆంజనేయ స్వామిని జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పార్టీ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అండదండలే తన శక్తి అనే భావంతో, జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధితో ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలని భగవంతుని వేడుకున్నారని తెలిపారు. భక్తి ఉంటేనే ముక్తి పొందగలుగుతామని ఆయన తన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



